calender_icon.png 21 April, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును మరో వారం పెంచాలి

12-04-2025 12:55:42 AM

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

 కరీంనగర్ క్రైమ్,ఏప్రిల్11(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు తేదీని మరో వారం రోజులు పొడిగించి కుల ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్స్ త్వరగా ఇచ్చేలా చూడాలని, అర్హులైన నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో  అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డ డిమాండ్ చేశారు.

రాజీవ్ యువ వికాస పథకం  దరఖాస్తు చేసుకోవడానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం నిరుద్యో గులు తీవ్రంగా రోజుల తరబడి ఇబ్బంది పడుతూ  తహసిల్దార్ కార్యాలయం చుట్టూ  తిరుగుతు న్నారని, ఇప్పటికే లక్షలాది మంది దరఖాస్తు  చేసుకోగా  చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా వారు ఇంకా లక్షల్లో ఉన్నారని  దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగ సమస్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని వారు ఎంత  ఉన్నారో అర్థం అవుతుందని, నిరుద్యోగులకు దాదాపు పది రోజులైనా గాని ధ్రువీకరణ పత్రాలు రావడంలేదని ఇదేమిటని తహాసిల్దార్ కార్యాలయంలో  అడుగుతే సాఫ్ట్వేర్ ఇబ్బంది ఉంది సమయం పడుతుందని  చెప్పడంతో దరఖాస్తు చేసుకోవాలన్న నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుందని,కొన్ని బ్యాంక్ లకే ఈ పథకం అనుసంధానం ఉన్న నేపథ్యంలో కొత్తగా బ్యాంక్ అకౌంట్ లు తీయడానికి కూడా సమయం పడుతుందని, దరఖాస్తుల  స్వీకరణకు ఈనెల 14 వరకు చివరి తేదీ ఉండడంతో నిరుద్యోగులు తహాసిల్దార్ కార్యాలయాల వద్ద,బ్యాంక్ ల వద్ద ధ్రువీకరణ పత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారని మరో వారం పొదగించాలన్నారు.