calender_icon.png 4 April, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడిగింపు

02-04-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): -రాజీవ్ యువ వికాసం పథకం క్రింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం సబ్సిడీ పై 50 వేల యూనిట్, 90 శాతం సబ్సిడీ పై లక్ష రూపాయల యూనిట్, 80 శాతం సబ్సిడీతో 2 లక్షల రూపాయల యూనిట్, 70 శాతం సబ్సిడీతో 4 లక్షల వరకు యూనిట్ లను యువకులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని అన్నారు.

లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత వారికి మంజూరు పత్రాలు జారీ చేయడంతో పాటు యూనిట్ గ్రౌండింగ్, వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన సూత్రాలపై శిక్షణ కూడా అందిస్తామని, ఆసక్తిగల యువకులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రకటనలో పేర్కొన్నారు.