19-03-2025 12:00:00 AM
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కాటారం, మార్చి 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్ఘాటించారు. అసెంబ్లీలో ఈ పథ కాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేం ద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేర్వేరు కార్యక్రమాలలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మంథని నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల రమేష్, జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం చైర్మన్ దండు రమేష్, మాట్లాడుతూ కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఎన్నికల్లో ఇచ్చి న మాటకు కట్టుబడి అసెంబ్లీలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారని తెలియ చేయుటకు సంతోసిస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా, ప్రస్తుత ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో ఒకటైన నిరుద్యోగ యువకులకు చేయూత అందించాలనే అంశంలో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి ఏను ముల రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారని అన్నారు.
కాటారం మండల ఎస్సి సెల్ అధ్యక్షులు గద్దల రమేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు దుర్గం రాజబాబు, నీలాల సమ్మయ్య, ఇనుగాల లింగయ్య, చిట్యాల చెందు, సాగర్, దామర వేణు, రాజు, సుధాకర్, మల్లయ్య, టాని, సుదర్శన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.