22-03-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి మార్చి 21 ( విజయ క్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువత కోసం ఏర్పాటుచేసిన రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగులకు గొప్ప వరం అని మున్సిపల్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె జహంగీర్ అన్నారు. రాజీవ్ యువ వికాసం కింద ఏర్పాటుచేసిన దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు కట్టుబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
నిరుద్యోగ యువత ఈ పథకాన్ని ఉపయోగించుకుని జీవితాలలో స్థిరపడాలని జహంగీర్ కోరారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది చొప్పున రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందేందుకు 6000 కోట్ల విధాలను ప్రభుత్వం మంజూరు చేసింది అని తెలిపారు ఒక్కో లబ్ధిదారునికి నాలుగు లక్షల వరకు రుణ మంజూరు చేసి 60 నుండి 80% వరకు రాయితీ ఇవ్వడం సంతోషకరమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు 75 యూనిట్లలో నైపుణ్యం ఉన్న పథకాన్ని అప్లై చేసుకున్నట్లయితే ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఉదిత్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో యువ వికాస్ పథకం ఆన్లైన్ ప్రక్రియ గత రెండు రోజుల నుండి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడుత రమేష్ గోపి శివ ఎండి ఇస్తాకర్ స్థిరపంగా నాగరాజు కుర శివకుమార్ ఎండి అఖిల్ చందుపట్ల విశ్వేశ్వరరావు పడారి నరేష్ భక్తుల బాబు కోర నాగేందర్ మహిళా సంఘం సభ్యురాలు ఇట్టబోయిన పావని ఇట్టబోయిన భాను తదితరులు పాల్గొన్నారు.