calender_icon.png 18 April, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రాజీవ్ యువ వికాస ఆర్థిక సహాయం అందించాలి

15-04-2025 07:30:04 PM

అధికారులను ఆదేశించిన మానుకోట కలెక్టర్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు అందించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. అలాగే వేసవి నేపథ్యంలో జిల్లాలోని 1,320 ఆవాస ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా స్థాయి అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పురుషోత్తం మధుసూదన్ రాజ్ నరసింహస్వామి శ్రీనివాసరావు, దేశి రామ్, శ్రీనివాస్, హరి ప్రసాద్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, ప్రేమ్ కుమార్, సురేష్, కృష్ణారెడ్డి, విజయనిర్మల, లీడ్ బ్యాంకు మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.