10-04-2025 12:40:31 AM
రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగులకు మేలు
పథకానికి పెరుగుతున్న దరఖాస్తులు
14 వరకు గడువు పెంచిన ప్రభుత్వం
అర్హుల తుది జాబితా తయారీలో మంత్రికే అధికారం?
నాయకుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ
వనపర్తి, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ) :నిరుద్యోగ యువత ఒకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో ఎందుకు సాగా లన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంతో సబ్సిడీ రుణాలను మంజూరు చేయడానికి సిద్ధమైంది. పి ఎస్ టి బి సి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రైతుపై అందించే రుణాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరు ప్రక్రియ అటకెక్కడంతో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కరువైంది. రాష్ట్ర ప్రభు త్వ ఇటీవల తీసుకున్న రాజీవ్ యువ వికా సం పథకంతో మళ్లీ నిరుద్యోగ యువతీ యువకుల్లో ఆశలు చిగురించగా అయితే ఒ క్కో నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు మం జూరు చేస్తారన్న దానిపై స్పష్టత రాకపోవడంతో కాస్త అయోమయంలో నిరుద్యోగ యువతీ యువకులు పడ్డారు.
ఈ నెల 14 వ తేదీ వరకు పొడిగింపు. ...
రాజీవ్ యువ వికాసం పథకానికి సం బంధించి దరఖాస్తు ప్రక్రియను గత నెల 17 వ తేది న ప్రారంభించగ నిరుద్యోగుల దరఖాస్తు లు వెల్లువేత్తున్న నేపథ్యంలో ఈ నెల 14 వ తేదీ వరకు పొడగించడంతో రోజు రోజుకు దరఖాస్తు ల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. దరఖాస్తు దా రులు తమ యూనిట్లకు సంబందించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించాలి.
సంబందించిన కార్పొరేషన్ తో పాటు కలెక్టర్ పర్యవేక్షణ లో మండల స్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులకు ఎంపిక చేసి తుది జాబితా ను ప్రకటిస్తారు. అర్హుల ఎంపిక కు సంబందించిన మార్గదర్శకాలను రూపొదించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అర్హుల తుది జాబితా జిల్లా మంత్రి కె అధికారాలు
లబ్ధిదారుల తమ వివరాలను ఆయా కార్పొరే షన్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆపత్రాలను ఆ యా మండల ఎంపిడివో, మున్సిపాలిటీ కా ర్యాలయం వద్ద దరఖాస్తు పత్రాలను అందచేయాలి. సంబందించిన అధికారులు దరఖా స్తుదారులు చేసుకున్న దరఖాస్తులను శీతస్థాయిలో పరిశీలించి అర్హులకు సంబంధించిన నివేదికను ఆయా కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాలకు పంపిస్తారు అక్కడ నుండి కలెక్టర్ వద్దకు ఆయా కార్పొరేషన్ల జిల్లా అధికారులు సమర్పించడం జరుగుతుంది. కాగా తుది అర్హుల జాబితాలో జిల్లా మంత్రులకు పూర్తిస్థాయి అధికారులు ఉండనున్నట్లు సమాచారం.
ఇప్పటికే నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు
సబ్సిడీ రుణాల కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు అధికారులు తయారు చేసే తుది జాబితానా లేక నాయకులు ఇచ్చే జాబితా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుడు నిజంగా అర్హుడైతే పథకం వర్తిస్తుం దని అధికారులు చెప్పినప్పటికీ , అధికారుల తుది జాబితా కాదు తమి చెప్పిన వారికే ఈ పథకం వర్తిస్తుందంటూ గ్రామ మండల పట్టణ స్థాయిలో కొంతమంది చోటామోటా నాయకులు చెబుతుండడంతో నిజమైన అ ర్హులకు పథకం వర్తిస్తుందా లేక నాయకుల కు చెప్పిన వారికి వర్తిస్తుందా అనేది దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు . దీంతో దరఖాస్తుదారులు తాము దరఖాస్తు చేసుకున్న పత్రాలను ఒక సెట్ అధికారులకు మరొక సెట్టు చోటామోటా నాయకులకు చేతిలో పెడుతూ తమకు వచ్చేలా చేయాలంటూ చోటామోటా నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లా వారీగా వివరాలు ఇలా ....
గత నెల 17 వ తేదీ నుండి ఈ నెల 08 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుల వివరాలు ఇలా....
ఎస్పీ కార్పొరేషన్.... 3882
ఎస్టీ కార్పొరేషన్ ..... 1547
బీసీ కార్పొరేషన్..... 10546
మైనార్టీ కార్పొరేషన్.... 1300