calender_icon.png 3 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసంతో యువతను ప్రోత్సహించాలి

02-04-2025 12:04:57 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్

చేగుంట, ఏప్రిల్ 1: రాజీవ్  యువ వికాసం పథకానికి చేగుంట మండలం నుండి ఎక్కువమంది దరఖాస్తులు చేసుకునేలా యువతను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రోత్సహించాలని చేగుంట కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్  ఒక ప్రకటన లో తెలిపారు, మండలంలో ఉన్న యువతరాజీవ్ యువ వికాసా నికి వీలైనంత ఎక్కువ మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కార్యకర్తలను కోరారు.

రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని మండల అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ పథకానికి రెండు లక్షల లోపు వార్షిక ఆదా యం ఉన్న వారందరూ అర్హులన్నారు. పథకం గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించిందనితెలిపారు.