calender_icon.png 26 November, 2024 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీభవన్‌కు చేరుకున్న ‘రాజీవ్ జ్యోతి’ యాత్ర

13-08-2024 12:44:44 AM

ఘనస్వాగతం పలికిన వీహెచ్, పార్టీ నేతలు 

20 ఢిల్లీకి చేరనున్న యాత్ర 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరుతో ఏటా ఆగస్టు 8న తమిళనాడులోని పెరంబదూర్ నుంచి ప్రారంభించే ‘రాజీవ్ జ్యోతి’ యాత్ర సోమవారం గాంధీభవన్‌కు చేరుకున్నది. పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్ర నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్‌పూర్ మీదుగా 20న ఢిల్లీ కి చేరుకుంటుంది. అదే రోజు రాజీవ్ వీర్ భూమి దగ్గర రాజీవ్ జ్యోతిని కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి అందజేయనున్నారు.

ఈ సందర్భంగా వీహె చ్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల యువకులకు రాజీవ్‌గాంధీ ఓటు హక్కు కల్పించారని అన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉందంటే.. దానికి రాజీవ్‌గాంధీ చేపట్టిన సాంకేతిక విప్లవమే కారణమని చెప్పారు. కొన్ని శక్తులు దేశంలో మత విద్వేశాలు సృష్టించాలని చూస్తున్నాయని మండిపడ్డా రు. దేశంలో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో  హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి సద్భావన యాత్రను రాజీవ్‌గాంధీ ప్రారంభించారని గుర్తుచేశారు.