టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): రాజీవ్‌గాంధీ జీవితం.. త్యాగాలమయని, ఆయన దేశం కోసం తన ప్రాణాలనే ఫణంగా పెట్టారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ప్రారంభమైన రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావన యాత్ర బుధవారం గాంధీభవన్‌కు చేరుకోగా యాత్రికులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మట్లాడుతూ.. గాంధీ కటుంబంలా దేశం కోసం ప్రాణాలర్పించినట్లు.. బీజేపీ నేతల కుటుంబాల్లో ఎవరైనా ఉన్నారా? ఆయన నిలదీశారు. దేశ ప్రజలకు రాజీవ్‌గాంధీ సేవలు తెలిసేలా కాంగ్రెస్ నేత దొరై యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు.