హైదరాబాద్, సెప్టెంబర్ 15( విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోమవారం సచివాలయం ఎదుట ఆవిష్కరించ నున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్ర మానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరవుతారని మంత్రి తెలిపారు.