calender_icon.png 20 September, 2024 | 9:14 AM

యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత

16-09-2024 05:28:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆయన విగ్రహం తెలంగాణ సచివాలయం ముందు ఎలా పెడతారని కొందరు ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారని కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎప్ పార్టీకి లేదని, ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత అన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత అని,  10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పాలనలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్ కు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని కోమట్టి రెడ్డి చెప్పారు.