- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- భారతరత్న విలువ తెలియకుండా మాట్లాడుతున్నారని ఫైర్
కరీంనగర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారతరత్న అంటే విలువ తెలియని వారు రాజీవ్‌గాంధీ విగ్రహం గురించి మా ట్లాడుతున్నారని, రాజీవ్‌గాంధీ విగ్రహం సచివాలయం వద్దే ఉంటుందని ఎవరూ తొలగించలేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనస భా వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. సాంకేతిక విప్లవాన్ని భారతదేశానికి తీ సుకువచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని అన్నారు.
తెలంగాణ ప్రజల కలను సా కారం చేసిన వ్యక్తి సోనియాగాంధీ అని, రాజీవ్‌గాంధీ తాత జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌గాంధీ గురించి తెలియని వారు ఆయ న విగ్రహం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అమిత్‌షా, నరేంద్రమోదీ నుం చి ప్రశంసలు పొందడానికి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారని పేర్కొన్నారు.
సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ స ందర్భంగా పేర్కొన్నారు. హైడ్రా అనేది చెరువులు, వనరులు కాపాడడానికేనని, అక్రమంగా ఎవరు ఏ పనిచేసినా ఊరుకునేది లేదన్నారు. అనర్హత వేటుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పం దిస్తూ దీనిపై శాసనసభాపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
స్కిల్ యూనివర్సిటీలో విశ్వకర్మలకు కోర్సు
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డె వలప్‌మెంట్ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు కోర్సును ప్రవేశపెడతామని, కరీంన గర్ హెడ్ క్వార్టర్‌లోనూ స్కిల్ సెంటర్‌ను ఏ ర్పాటు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా బు అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విశ్వకర్మ యజ్ఞ మ హోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మల శ్రమలేనిది విశ్వంలో ఏ పని జరగదన్నారు.
స్కిల్ యూనివర్సిటీలో విశ్వకర్మల నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సును ప్రవేశపెడతామ ని తెలిపారు. కరీంనగర్‌లో విశ్వకర్మలు భవ నం నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలం పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
పలువురికి పరామర్శ
మంథని: మంథని మాజీ సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఇటీవలే మృతిచెందారు. కరీంగనర్‌లో సత్య నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. మంథని మండ లంలోని స్వర్ణపల్లి గ్రామంలో కుక్కల దాడి లో గాయపడి కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.
ప్రతి గ్రామానికి ఫైబర్ నెట్‌వర్క్
కేంద్రం సహకారంతో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఫైబర్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇప్పటికే 8 వేల గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్ పనులు పూర్తయ్యాయని, ఇంకా 3 వేల గ్రామాలకు పూర్తి చేయవలసి ఉందని పేర్కొన్నారు. గ్రామగ్రామాన్ని కలుపుకుంటూ ఈ పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా సంగిపేట, నారాయణఖేడ్ జిల్లా మద్దునూరు, పెద్దపల్లి జిల్లా అట వి శ్రీరాంపూర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని పనిచేస్తున్నామని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉపయోగిస్తామని వెల్లడించారు. రెండు నెలల్లో ఈ మూడు గ్రామాల్లో సేవలు ప్రారంభమవుతాయన్నారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.