హైదరాబాద్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద 34వ రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావనా అవార్డును సీఎం ప్రదానం చేశారు. ఈ కార్యక్రంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 1990లో రాజీవ్ గాంధీ పార్టీ పతాకాన్ని ఎగురవేసిన చోట ఉదయం 10.30 గంటలకు పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.