calender_icon.png 15 January, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రజిత

01-09-2024 02:11:22 AM

కామారెడ్డి, ఆగస్టు 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మారెడ్డి రజితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ విషయాన్ని వెల్లడించారు. వైస్ చైర్మన్‌గా జొన్నల రాజు నియమితులయ్యారు. మారెడ్డి రజిత భర్త వెంకట్‌రాంరెడ్డి 2015 నుంచి మూడు సంవత్సరాల పాటు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.

10 ఏళ్లలో భార్యభర్తలు ఇద్దరు మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం విశేషం. కాగా శనివారం హైదరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును రజిత, వెంకట్‌రాంరెడ్డి దంపతులు కలిసి, బాధ్యతను అప్పగిం చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోటోరైటప్:31కెఎంఆర్07ఎ: హైదారాబాద్‌లోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నివాసంలో మార్కెట్ కమిటి చైర్‌పర్సన్‌గా మారెడ్డి రజిత ఎన్నిక కావడంతో పుష్పగుచ్చం అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు.