05-04-2025 12:00:00 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బంగారం స్మగ్లిం గ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ కొన్నిరోజుల క్రితమే పూర్తయ్యింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. అయితే, మేకర్స్ శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రజనీకాంత్ విజల్ వేస్తూ కనిపిస్తున్నారు. మరోవైపు తారీఖున హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ‘వార్2’ కూడా విడుదల కానుంది. కొంతకాలంగా అంతా అనుకుంటున్నట్టే దిగ్గజ నటుల సినిమాలు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలక వస్తూ, బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం ఆసక్తికర చర్చకు దారి తీసింది.