తిరువనంతపురం,(విజయక్రాంతి): కేరళ 23వ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ జామ్‌దార్ ప్రమాణం చేయించారు. బీహార్ గవర్నర్‌గా నియమితులైన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తర్వాత రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గత వారం బీహార్ గవర్నర్ ఆర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేబినెట్ మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.