కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా రాజేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. వరంగల్ అడిషనల్ కమిషనర్ గా పనిచేసిన రాజేందర్ రెడ్డి పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. బాధ్యతలకు స్వీకరణ అంటే ముందు కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన స్పందన నెల పదిరోజుల పాటు ఇక్కడ విధులు నిర్వహించి రంగారెడ్డి మెప్మా పిడిగా బదిలీపై వెళ్లారు. రాజకీయ వేధింపులు తట్టుకోలేక సెలవుపై వెళుతున్నట్లు చెప్పి బదిలీ చేయించుకొని వెళ్లినట్లు తెలుస్తోంది.