calender_icon.png 29 April, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

35 బంతుల్లో సెంచరీ.. రాజస్థాన్ అద్భుత విజయం

28-04-2025 11:00:29 PM

జైపూర్: ఐపీఎల్ 2025 సీజన్-18 లో అతి పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) పై 35 బంతుల్లోనే సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదు అయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 15.5 ఓవర్లలోనే విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(101), యశస్వీ జైస్వాల్(70), రియాన్ పరాగ్(32) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.