18-02-2025 01:25:26 AM
పెన్ పహాడ్, ఫిబ్రవరి 17: గతంలో పీఆర్టీయు సంఘంలో క్రీయాశీలంగా పోసించి నల్లగొండ-ఖమ్మం -వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలువు కోసం అహర్నిషలు కృషి చేసి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉండిన మేకల రాజశేఖర్ కొన్ని యేండ్లుగా సంఘానికి దూరంగా ఉండడం బాధకర మని నేడు తన గెలువు కోసం రాజశేఖర్ బ్యాక్ టూ బ్యాక్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణా మమని పీఆర్ టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి శ్రీపాల్ రెడ్డి అన్నారు.
ఆసంఘం జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన ప్రచార సామావేశంలో పాల్గొని రాజశేఖర్ ని సంఘంలోకి సభ్యత్వాన్ని అందించి ఆహ్వానించారు. తాను సంఘంలో కొనసాగుతున్న నాటి నుంచి రాజశేఖర్ సంఘం అభివృద్ధి, కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారం లో కృషి ఎనలేనిది అన్నారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్ధి గెలువు కోసం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని ఉపాధ్యాయులలో మంచి క్రేజ్ సంపాదించు కోవడంతో పాటు నాయకత్వ పటిమ, పట్టుడల ఉండడంతో పీఆర్‌ఎయూ టీఎస్ గెలువు సులభతరం అయిందన్నారు.
ప్రతి ఒక్కరూ తన గెలువు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని..అంతేకాదు తాను గెలిచిన వెంటనే యేండ్ల తరబడి ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వరిస్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సంఘం నాయకులు పాల్గొన్నారు.