calender_icon.png 13 October, 2024 | 4:50 PM

‘రాజాసాబ్’ క్లిప్ టాక్!

09-10-2024 12:00:00 AM

బస్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాలతో దర్శకుడు మారుతి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తు తం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ కోసం మారుతి పడుతున్న కష్టాన్ని వీడియోగా రూపొందించి గ్లింప్స్ పేరిట విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం ఒక ఎత్తుతై చివరిలో ప్రభాస్‌తో మారుతి కలిసి ఉన్న క్లిప్ మరో ఎత్తు. ప్రభాస్ అభిమానులను ఈ చిన్న క్లిప్ బాగా ఆకట్టుకుంటోంది.