calender_icon.png 20 January, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నా.. మురుగు గోస తీరేనా?

20-01-2025 01:19:19 AM

  1. వేములవాడ గుడి చెరువులోకి మురుగు నీళ్లు
  2. రూ.౩ కోట్లతో పైప్‌లైన్ నిర్మాణానికి టెండర్లు
  3. ఐదు నెలలు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు
  4. తనిఖీల పేరుతో ఇంజినీరింగ్ అధికారుల కాలయాపన
  5. మళ్లింపు పనుల్లో జాప్యం.. పట్టణ వాసులకు శాపం 

సిరిసిల్ల, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవా డ శ్రీరాజరాజేశ్వరస్వామివారి సన్నిధి లో మురుగు నీటి సమస్యతో అటు భక్తు లు, ఇటు స్థానికులు సతమతమవుతున్నా రు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులతోపాటు స్థానికులకు మురుగు నీటి సమస్య తొలగించేందుకు రూ.౩ కోట్లు వెచ్చించినా.. అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో ముందడుగు పడట్లేదు. 

వేములవాడ పట్టణంలో ని మురుగు నీరు గుడి చెరువులో కలువకుండా గత ఏడాది ఆగస్టు ౮న రూ.౩ కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. మురుగునీరు మళ్లించేందుకు మూడు కో ట్ల నిధులు ఉన్నా ముందుకు పనులు సాగ డం లేదు. పనులు ప్రారంభించి ఐదు నెల లు గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తను తలపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడంతోపాటు మురుగు నీరు యథావిధిగా గుడిచె రువులోకే వెళ్తుంది.

నిత్యం 80 లక్షల లీటర్ల మురుగు వ్యర్థాలు 

వేములవాడ పట్టణంలోని మురుగునీరు గుడి చెరువులో కలువకుండా గత ఏడాది ఆగస్టు 8న రూ.3 కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకు పనులు అనుకున్న రీతిలో ముందుకుసాగడం లేదు. వేములవాడలో ప్రతినిత్యం దాదాపు 80 లక్షల లీటర్ల మురుగునీటి వ్యర్థాలు వస్తుండ గా, ప్రధానంగా 15 లక్షల  లీటర్ల నీరు కట్టు కాలువ నుంచి గుడిచెరువులోకి వెళ్తున్నాయి. పనులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన ఆధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ, తనిఖీల పేరుతో అధికారులు పనులు జాప్యం చేస్తుండటంతో  పట్టణ వాసులకు శాపంగా పరిణమించింది. గుడి చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో  ఎఫ్‌టీఎల్‌ను ఆనుకొని వేయాల్సిన పైన్ పనులు ఆలస్యమవుతోందని మున్సిపల్ అధికారులు చెప్తు న్నారు. వేములవాడ పట్టణంలో ప్రతినిత్యం 50 లక్షల లీటర్ల నుంచి 60 లక్షల లీటర్ల మురుగు నీరు వెలుబడుతోందని అంచనా వేస్తున్నారు. కట్టుకాలువ, భగవంతరావునగర్ కాలనీతోపాటు16 చోట్ల మురుగు నీరు సుమారు ప్రతిరోజు 15 లక్షల లీటర్లు గుడి చెరువులో కలుస్తోందని అధికారులే పేర్కొనడం గమనార్హం. మున్సిపల్ నిధులు రూ.3 కోట్లతో మురుగు నీటి పనుల మళ్లింపుకు 2024 ఆగస్టులోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆగస్టు 9న పనుల ప్రారంభానికి శిలాఫలకం కూడా వేశారు. ఐదు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉన్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

2.2 కిలోమీటర్ల మేర పైపులైన్

వేములవాడ కట్టు కాలువ నుంచి జగిత్యాల బస్టాండ్ వరకు మురుగు నీటిని అండర్ గ్రౌండ్ పైపు లైన్ ద్వారా తరలించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. రెండడుగుల డయాగ్రామ్ గల పైప్‌లైన్ ద్వారా 2.2 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి మురుగునీటి మళ్లించేందుకు నిర్ణయించారు. భారీవర్షాల నేపథ్యం లో గుడి చెరువు పూర్తిస్థాయి నీటితో నిండి ఉండగా ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించి, దాని వెంట పైప్ లైన్ నిర్మాణం చేపట్టేలా ప్లాన్ చేశారు. ఇక గుడి చెరువులోనూ సేకరించిన పార్కింగ్ స్థలం నుంచే జగిత్యాల బస్టాండ్ వరకు పైప్‌లైన్ వేయనున్నారు. 



తనిఖీల పేరిట ఆలస్యం

మురుగు నీటి తరలింపు కోసం అండర్ గ్రౌండ్ ద్వారా వేసే పైపులను మున్సిపల్ విభాగం ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి అనుమతించిన తర్వాతే పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పైపులు తయారవుతున్న ఫ్యాక్టరీకి వెళ్లిన అధికారులు రెండుసార్లు తనిఖీలు చేశారని సదురు విభాగం అధికారులు వెల్లడిం చారు. మరోవైపు గుడి చెరువులో నీటి నిల్వలు ఉన్నందున ఎఫ్‌టీఎల్ హద్దులు ఏర్పాటు చేయాలని సదరు విభాగం అధికారులని కోరామని తెలిపారు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ మురుగునీటిని మళ్లించేందుకు అధికారులు చేస్తున్న జాప్యంతో పట్టణవాసులు, భక్తులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని, వేగంగా మురుగునీటి మళ్లింపు నకు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు విజ్ఞప్తిచేస్తున్నారు.

రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తాం 

మురుగునీటి మళ్లింపు పనులు శరవేంగంగా సాగుతున్నాయి. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి, పట్టణవాసులకు మురుగునీటి సమస్య లేకుండా చేస్తాం. జగిత్యాల బస్టాండ్ నుంచి గుడి చెరువు మీదుగా పనులు మొదలుపెట్టాము. ఈ పనుల్లో భూములు కోల్పోయే వారితో ఉన్నతాధికారులు చర్చించి సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

 నరసింహస్వామి, 

మున్సిపల్ ఏఈ, వేములవాడ