calender_icon.png 26 November, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నా.. అవినీతి లీలలు సూడన్నా

29-08-2024 03:35:31 AM

  1. వేములవాడ ఆలయ పరిధిలో అధికారుల అక్రమాలు 
  2. నాలుగు విభాగాలపై విచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ సోదాలు 
  3. నివేదిక ఆధారంగా 20 మంది అంతర్గత బదిలీలు

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రసిద్ధ దేవాలయా ల్లో వేములవాడ రాజన్న ఆలయం ఒకటి. ఆలయ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉ ద్యోగుల అవినీతి కారణంగా ఆలయానికి అప్రతిష్ఠ వచ్చే పరిస్థితులు దాపురించాయి. ప్రధానంగా నాలుగు శాఖలపై వస్తున్న ఆ రోపణలపై ఇటీవల ఆలయంలో ఏసీబీ  అ ధికారులు సోదాలు నిర్వహించారు. 20 మ ంది అధికారులతో కూడిన బృందాలు రెండు రోజుల పాటు సోదా చేశాయి. లీజు టెం డర్లు, నిత్యాన్నదానం సత్రం రికార్డులను ప రిశీలించారు. ప్రధానంగా లడ్డూ ప్రసాదాల తయారీ విక్రయాలకు సంబంధించిన గో దాం నిలలు, లీజులు టెండర్లు, వసతి గ దుల సముదాయాలు, నిత్యాన్నదానం సత్రంలోని అన్ని రికార్డులను పరిశీలించారు. తనిఖీలు చేసిన సమయంలో ప్రతి అంశా న్నీ ల్యాప్‌టాప్‌ల లో పొందుపరిచారు. 

20 మంది ఉద్యోగుల అంతర్గత బదిలి..

ఆలయ అధికారుల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ నివేదిక ఆధారంగా ఆల య ఈవో వినోద్ రెడ్డి అంతర్గత బదిలీలు చే పట్టారు. ఏకంగా 20 మంది అధికారులను బదిలీ చేశారు. ప్రధానంగా సరుకుల నిల్వ లో వ్యత్యాసం రాగా, గోదాం పర్యవేక్షకుడిని బాధ్యతల నుంచి తప్పించారు. కల్యాణ కట్టలోనూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చే స్తున్నారన్న ఆరోపణలతో విధులు నిరహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక పరిచారి కను కూడా బాధ్యత లు నుంచి తొలగించారు.

ముగ్గురు పర్యవేక్షకులతోపాటు తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు రికార్డ్ అ సిస్టెంట్లు ఒక పరిచారికతో కలిపి మొత్తం 20 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తరులు జారీ అయ్యాయి. కల్యాణకట్టలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు రికార్డ్ అసిసెంట్లు ఒక పరిచా రికను బాధ్యతల నుంచి తొలగించారు. ము గ్గురు ఆలయ సూపరింటెండెంట్లు, తొమ్మి ది మంది సీనియర్ అసిస్టెం ట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు రికార్డ్ అసిస్టెంట్లు, పరిచారికను బదిలీ చేశారు.

ఇంక్రిమెంట్ల నిలిపివేత..

2021 అక్టోబర్‌లో జరిగిన విజిలెన్స్ తనిఖీల్లో అవినీతి బాగోతం బయటపడిం ది. అ ప్పటి సోదాలకు సంబంధించి ఈ ఏ డాది ఏప్రిల్‌లో విజిలెన్స్ నివేదిక బయట కు వచ్చింది. ముగ్గురు ఏఈవోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెం ట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లతోపా టు ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో కలి పి 12 మంది అక్రమాలకు పాల్పడినట్లు ని వేదికలో బహిర్గతమైంది. దీని ప్రకారం ము గ్గురు ఏఈవోలకు ఇంక్రిమెంట్లు సైతం నిలిచిపోయాయి.

అలాగే లడ్డూ ప్రసాదాల విభాగం పర్యవేక్షకుడికి రూ.1.88 లక్షలు, అదే విభాగానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ కు రూ.80 వేలు, గోదాములో సరుకుల వ్యత్యాసంపై సంబంధిత పర్యవేక్షకుడు రూ. 21 వేలు చెల్లించాలని ఏప్రిల్‌లో అప్పటి ఈ వో కృష్ణప్రసాద్ ఆదేశించారు. లడ్డూ ప్రసాదాల విభాగం, గోదాం పర్యవేక్షకులు సదరు నగదు సామివారి ఖజానాకు చెల్లించగా, జూనియర్ అసిస్టెంట్ మాత్రం తిరిగి సొమ్ము చెల్లించలేదు. ఈవో వినోద్‌రెడ్డి సైతం నగదు చెల్లించాలని జూలై లో జూనియర్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఆలయంపై ప్ర త్యేక దృష్టి సారించి, అక్రమార్కుల పనిపట్టాలని భక్తులు కోరుతున్నారు.