గేమ్ ఛేంజర్ ముంబై ప్రెస్‌మీట్‌లో రామ్‌చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూ డియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సిని మా జనవరి 10న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ప్రె స్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో.. రామ్‌చరణ్ మాట్లాడు తూ.. ‘శంకర్ గారితో సినిమా చే యడం నా అదృష్ణం. రాజమౌళి, శంకర్ ఇద్దరూ టాస్క్ మాస్టర్లే’ అన్నారు. దిల్ రాజు మాట్లాడు తూ.. “గేమ్ చేంజర్’ నా బ్యానర్‌లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎ త్తున నిర్మించాలని అనుకున్నాం.
ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్‌చరణ్‌కు అయితే బాగుంటుంద ని అనుకున్నా’ అని చెప్పారు. అనిల్ తడా ని మాట్లాడుతూ.. ‘హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. శంకర్ గారు ఎప్పుడూ కూడా భారీ సినిమాల్నే తీస్తుంటారు. గతంలో నేను ఆయన సినిమాల్ని రిలీజ్ చేశాను. రామ్‌చరణ్ గారి తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అ న్నారు.
ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. “గేమ్ చేంజర్‌లో శంకర్ గారు, రామ్‌చరణ్ గారితో పనిచేయడం గర్వంగా అని పిస్తోంది. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను’ అని తెలిపారు.
టికెట్ ధర పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్
రామ్ చరణ్, శంకర్ కాంబోలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూ పొందింది ‘గేమ్ ఛేంజర్’ చిత్రం. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది.
అర్ధరాత్రి 1 గంట ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. జనవరి 10న ఆరు షోలకు టికెట్ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకూ టికెట్ ధర పెంచుకోవచ్చని తెలిపింది.