26-03-2025 06:36:23 PM
మందమర్రి (విజయక్రాంతి): ఇటీవల గోవాలో జరిగిన జాతీయ వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలలో పట్టణానికి చెందిన మాజీ సింగరేణి కార్మికుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పల్లం రాజాలింగు పాల్గొని కాంస్య పతకం సాధించారు. 75 సంవత్సరాల విభాగం డబుల్స్ పోటీలో విజేతగా నిలిచి కాంస్య పతకం అందుకున్నారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన ఆయన వచ్చే నెల థాయిలాండ్ లో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజలింగు మాట్లాడుతూ... గతంలో రెండుసార్లు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారని 75 ఏళ్ల వయస్సులో ఆడే అవకాశం సత్తా ఉన్న ఆర్ధిక స్థోమత లేక వెళ్ళలేక పోయినట్లు తెలిపారు.