calender_icon.png 29 March, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో..

24-03-2025 05:32:45 PM

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ బాపు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్(KCR) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం(BRS Chennur Constituency) ఇంఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు వెంటనే బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ సోమవారం చెన్నూర్ నియోజకవర్గం పరిధిలోని జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బండి సంజయ్ తన వాక్యాలను వెనక్కి తీసుకుని కేసీఆర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చే దమ్ములేని ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని మండిపడ్డారు. చేతనైతే తెలంగాణకు నిధులు మంజూరు చేయించాలని, ఇంకొసారి కేసీఆర్ పై, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీపై నోరు జారితే  పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాదబోయిన కృష్ణ, బడికెల సంపత్, మల్లేష్, మాజీ ప్రజాప్రతినిధులు నవాజ్ షరీఫ్, మంత్రి బాపు, మోతే తిరుపతి, రేవెల్లి మహేష్, సురేష్ రెడ్డి, జోడు శంకర్, నాయిని సతీష్, శ్రీను, జిలీల్, ఆశిష్, నయాబ్, ప్రశాంత్, అశోక్, భారతి, సురేష్, శేఖర్, మణి లు పాల్గొన్నారు.