calender_icon.png 26 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్ తరుణ్ చాలా బరువున్నాడు!

05-07-2024 12:05:00 AM

మాది హిమాచల్ ప్రదేశ్. చదువుకోవడానికి ముంబయి వెళ్లాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నా కెరీర్ మొదలైయింది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఒక మలయాళం, తమిళ్ సినిమా కూడా చేశాను. తెలుగులో ‘తిరగబడరసామీ’ నా మొదటి సినిమా. 

బాలకృష్ణ మాటల్లో ఫిల్టర్ ఉండదు 

ఈ సినిమాలో నేను బాలకృష్ణ గారి అభిమానిగా కనిపిస్తాను. బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ ఉండదు.. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడేస్తారు. సినిమాలో నా క్యారెక్టరూ అలానే ఉంటుంది. మహిళలకు ఆత్మరక్షణ ప్రాముఖ్యతను నేర్పించేలా ఉంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. -బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను.  ఆయన గత చిత్రం ‘భగవంత్ కేసరి’ని చాలా ఎంజాయ్ చేశాను.  

రాజ్ తరుణ్‌తో వర్క్ మంచి అనుభూతినిచ్చింది 

ఇందులో యాక్షన్, డ్రామా, రొమాన్స్, ఫన్.. ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. రవికుమా ర్ గారు విజన్ ఉన్న డైరెక్టర్. ప్రొడ్యూసర్ శివ గారు చాలా మంచి వ్యక్తి. కుటుంబ సభ్యుడిలా ఉంటారు. వాళ్ల అమ్మాయీ, నేను మంచి స్నేహితులమైపోయాం. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. -ఇక రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే.. చాలా నైస్ పర్సన్. సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు.

ప్రోత్సహించే వ్యక్తిత్వం ఆయనది. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చిం ది. షూటింగ్‌లో భాగంగా ఆయన్ను ఎత్తుకోవాల్సి వచ్చింది.. వామ్మో చాలా బరువు.. కనీసం 75 కిలోలైనా ఉండి ఉంటాడు.. కష్టమైనప్పటికీ మోయాల్సి వచ్చింది. ఇక మకరంద్ దేశ్‌పాండే గారి గురించి చెప్పాలం టే, గొప్ప నటుడు.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. 

నాని యాక్టింగ్ ఇష్టం.. 

తెలుగు సినిమాలు కూడా చూస్తుంటా ను. ‘బొమ్మరిల్లు’, ‘ఏ మాయ చేశావే’ నా ఫేవరేట్ ఫిలిమ్స్. రీసెంట్ గా ‘బేబి’ సినిమా చూశాను. రాజమౌళి గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో పార్ట్ కావ డం నా కల. అలాగే మణిరత్నం సార్‌తో కూడా కలిసి పని చేయాలని ఉంది. తెలుగు లో హీరోలందరూ ఇష్టమే. ఒక థియేటర్ ఆర్టిస్ట్‌గా యాక్టర్ కళ్లలో డెప్త్ గురించి మాట్లాడుకుంటే.. నాని గారి పేరు చెప్తాను. కళ్లతో అద్భుతమైన భావాలు, భావోద్వేగాలు పలికించే నటుడు ఆయన. ఆయనతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే మహేశ్‌బాబు గారు, అడివి శేష్ గారు కూడా ఇష్టం. -అన్ని జోనర్స్ ఇష్టమే. అయితే కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఇష్టపడ తాను. తెలుగులో కొత్తగా సైన్ చేసిన ప్రాజెక్ట్స్‌లూ ఉన్నాయి.