calender_icon.png 28 October, 2024 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్ తరుణ్ కాబోయే మాస్ హీరో

03-07-2024 12:05:00 AM

రాజ్ తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడి యా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్  నిర్మిస్తున్నారు. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో రాజ్‌తరుణ్ మును పెన్నుడూ చూడని విధంగా యాక్షన్ అవతార్‌లో కనిపించారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నటుడు తాగుబోతు రమేశ్, ఇతర చిత్ర బృందం హాజరయ్యా రు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ “ఈ స్థాయిలో యాక్షన్ సినిమా చేయడం ఇదే తొలిసారి.

దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ప్రోత్సాహం తోనే ఈ పాత్ర చేయగలిగాను. త్వరలోనే థియేటర్స్‌కి రానున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు. అనంతరం డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ “2004 ఇదే రోజున ‘యజ్ఞం’ సినిమా విడుదలై నా జీవితాన్ని మలుపు తిప్పింది. మళ్ళీ అదే రోజున ఈ ట్రైలర్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ కాబోయే మాస్ హీరో. ఈ సినిమా తర్వాత తను మాస్ హీరోగా నిలబడతాడు’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: జేబీ, భోలే షావలి, సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి.