calender_icon.png 8 January, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాంచ్ మీనార్‌లో రాజ్ తరుణ్

02-01-2025 12:56:00 AM

గత ఏడాది ‘తిరగబడరా స్వామి, భలే ఉన్నాడే’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. కొత్త ఏడాదిలో తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను వదిలాడు. ఈ సినిమాకు ‘పాంచ్ మినార్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజయ్ గోష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజ్ తరుణ్ కారుపై పడుకుని ఉండగా.. అతని చుట్టుపక్కల అంతా డబ్బుల నోట్లు పడి ఉండేలా పోస్టర్‌ను చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.