14-02-2025 12:40:43 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి13: రాజ్‌తరుణ్‌తోపాటు అతడి కుటుంబానికి సారీ చెబుతున్నా.. మస్తాన్‌సాయి విషయం కోర్టులోనే తేల్చుకుంటా.. మరోసారి మీడియా ముందుకు రానని రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
పోలీసుల విచారణలో మస్తాన్ సాయికి సంబంధించిన ఇంకా చాలా విషయాలు వెలుగుచూస్తాయన్నారు. తన వీడియోలను గుర్తుతెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారని ఆమె తెలిపింది. తాను గత సెప్టెంబర్‌లో నార్సింగి డీఐతో కేసు విషయమై మాట్లాడింది నిజమేనని స్పష్టం చేశారు.
ఆ సమయంలో మస్తాన్ సాయి తన పక్కన ఉన్నట్లు తెలిపింది. తన అనుమతి లేకుండా కొందరు ఆడియో, వీడియో కాల్స్‌ను వైరల్ చేయడం సరికాదన్నారు. మస్తాన్ సాయి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, తనపై అత్యాచారం చేశాడని, తనను మోసం చేసినట్లే ఎంతోమంది అమ్మాయిలను వంచించాడని ఆరోపించింది.
మస్తాన్ సాయితోపాటు అతడి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. రాజ్‌తరుణ్‌పై పెట్టిన కేసులను కూడా తాను వాపస్ తీసుకుంటానని వెల్లడించింది.
పోలీసు కస్టడీకి మస్తాన్ సాయి
న్యాయమూర్తి అనుమతితో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇటీవల అతడిని కోకాపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. లావణ్య ఓ హార్ట్ డిస్క్‌ను పోలీసులకు అందజేసిన విషయం తెలిసిందే.
అందులో మస్తాన్‌సాయి వందలాది మంది మహిళలతో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఉన్నాయని ఆరోపించింది. అతడు డ్రగ్స్ ఇచ్చి ఎంతోమందిని చెరబట్టాడంది. మస్తాన్ సాయికి డ్రగ్స్ కేసుతో గల సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.