calender_icon.png 18 January, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్ తరుణ్.. విచారణకు రండి

17-07-2024 06:16:26 AM

  • నోటీసులు జారీ చేసిన నార్సింగి పోలీసులు 
  • ఈ నెల 18లోపు రావాలని సూచన 

రాజేంద్రనగర్, జూలై 16: సినీ నటుడు రాజ్‌తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లావణ్య ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోపు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. రాజ్‌తరుణ్ తనను గుడిలో వివాహం చేసుకొని కాపురం చేసి మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. రెండుసార్లు అబార్షన్ చేయించాడని కూడా ఫిర్యాదులో పేర్కొం ది. అందుకు సంబంధించిన మెడికల్ వివరాలతోపాటు 170 ఫొటోలను నార్సింగి పోలీసులకు ఇచ్చింది. హీరోయి న్ మాల్వీ మల్హోత్రాతో రాజ్‌తరుణ్ సన్నిహితంగా ఉం టూ తనను దూరం పెట్టాడని, మాల్వీ మల్హోత్రాతో పా టు అతడి సోదరుడు తనను బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. కేసు విత్‌డ్రా చేసుకునేందుకు రూ.5 కోట్లు రాజ్‌తరుణ్ ఆఫర్ చేశాడని కూడా లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.