రంగారెడ్డి,(విజయక్రాంతి): జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల తన న్యాయవాదితో కలిసి చేవెళ్ల ఎక్సైజ్ పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో కోనసాగుతుంది. అయితే గత నాలుగు రోజు క్రితం జన్వాడలో కేటీఆర్ బావమరిది ఫాంహౌస్ లో మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్కడ ఏడు రకాల విదేశీ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు, 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది రేవ్ పార్టీ కాదని, ఇల్లు దావత్ అని రాజ్ పాకాల స్పష్టం చేశారు.