calender_icon.png 10 January, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడుగా రాజ్ కుమార్

09-01-2025 10:38:02 PM

మంచిర్యాల (విజయక్రాంతి): బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడుగా అమిరిశెట్టి రాజ్ కుమార్ ను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బద్దం లింగారెడ్డి నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ జనతా పార్టీలో రాజ్ కుమార్ కార్యకర్త స్థాయి నుంచి యువమోర్చాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ మంచిర్యాల యువమోర్చా పట్టణ అధ్యక్షునిగా, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. మంచిర్యాల పట్టణంలో పార్టీని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తానని, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే పోరాటాలు చేస్తామని రాజ్ కుమార్ అన్నారు.