calender_icon.png 2 October, 2024 | 9:51 PM

ముగిసిన వానకాలం

02-10-2024 01:48:31 AM

  1. 8 శాతం అధికంగా కురిసిన వర్షాలు
  2. దేశంలో సగటున 934 మి.మీ. వర్షపాతం నమోదు

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో సోమవారంతో నైరుతి రుతుపవన కాలం అధికారికంగా ముగిసింది. ఈ ఏడాది వానాకాలంలో 8 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం అక్టోబర్ చివరినాటికీ వర్షాలు పడే అవకాశం తెలుస్తోంది. నైరుతి రుతుపవనాల కాలంలో దేశంలో సగటున 934 మి.మీ.

వర్షపాతం నమోదైందని, దీర్ఘకాలిక సగటలో ఇది 108 శాతమని వాతావరణశాఖ వెల్లడించింది. దేశంలో మధ్యప్రాంతంలో 19 శాతం, దక్షిణాదిలో 14శాతం, వాయువ్య ంలో 7 శాతం అధిక వర్షాలు కురిశాయి. తూర్పు, ఈశాన్యంలో మాత్రం 14 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.