calender_icon.png 20 September, 2024 | 12:07 PM

వానకాలం రైతు భరోసా లేనట్టేనా?

17-09-2024 04:10:03 AM

  1. పక్షం రోజుల్లో ముగుస్తున్న సీజన్
  2. అప్పు చేసి పంటలు వేసిన అన్నదాతలు
  3. పెట్టుబడి సాయం 15 వేలు ఎక్కడ 
  4. ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రేవంత్ సర్కార్ వానాకాలం(ఖరీఫ్) పంటకు పెట్టుబడి ఇస్తుందని ఆశపడితే సీజన్ ముగిసినా రైతు ఖాతాలో నగదు జమ చే సే పరిస్థితి దరిదాపులో కనిపించడం లేదు. ఈనెలాఖరులో వానాకాలం పంట సీజన్ ముగుస్తున్న ఇప్పటివరకు రైతు భరోసా గు రించి పట్టించుకునే నాథుడు లేడు. ఎన్నికల్లో ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ప ంట సాయం మాటెత్తడం లేదు. దీంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నారు. రూ. 15వేలు ఇస్తానని నమ్మబలికితే అధికారం చేపట్టిన తరువాత పెట్టుబడి సాయం ఊసేలేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో త గిన గుణపాఠం తప్పదని అన్నదాతలు హె చ్చరిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఏటా ఎ కరానికి రూ. 10వేలు సకాలంలో బ్యాంక్ ఖా తాలో జమ చేసేందని, కనీసం పాత విధాన ం కూడా పాటించడం లేదంటున్నారు. రైతు పక్షపాతిననే పాలకుల మాటలు హమీలకే పరిమితమైన్నట్లు విమర్శలు చేస్తున్నారు. 

86లక్షల ఎకరాల్లో పంటలు..

వచ్చే నెల నుంచి యాసంగి పంట కాలం ప్రారంభమైతుందని, అప్పటిలోగా మొదటి విడుత సాయం అందిస్తే అప్పుల బాధల నుంచి బయపడుతామని రైతులు పేర్కొంటున్నారు. వానాకాలం పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలంలో రైతులు 86లక్షల ఎకరాల్లో పంట సాగు చేయగా, అందులో పత్తి, వరి పంటలు పెద్ద మొత్తంలో సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పరిహారం కూడా పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. 

సీజన్ ముగుస్తున్నా..

ప్రభుత్వం ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టి పంట సాగు చేసే రైతులను గుర్తించి సహాయం చేస్తామని పేర్కొంది. 20 లక్షల ఎకరాల భూమిలో సాగు చేయడంలేదని, వాటిని రైతు భరోసా జాబితా నుంచి తొలగించి 5 నుంచి 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండు నెలలు గడిచిన వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చినా పెట్టుబడి సాయం జాడలేదు. 

68.99లక్షల మంది రైతులు..

రాష్ట్రంలో 68.99లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు రెవె న్యూ గణాంకాలు చెబుతున్నాయి. గత యా సంగిలో ప్రభుత్వ రైతు భరోసా లెక్క ప్రకా రం ఎకరం లోపు రైతులు 24,24,870 మం ది ఉండగా వారి వద్ద 13.57లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అదే విధంగా 2 ఎకరాల్లోపు ఉన్న రైతులు 17,72,675 మంది ఉం డగా వారి వద్ద 26.58లక్షల ఎకరాలు ఉ న్నాయి. మొత్తం 5 ఎకరాల లోపు రైతులు రాష్ట్రంలో 64,75,320 మంది ఉండగా, వా రి వద్ద 1,11,49,534 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరంతా దాదాపు వ్యవసాయంపై ఆధార పడి జీవించే కుటుంబాలే. ప్రభుత్వం పంట సాయం అందించకపోతే పండించిన పంట అప్పులు తీసుకొచ్చిన వ్యాపారులకే చెల్లించాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.