calender_icon.png 22 October, 2024 | 3:57 PM

వానకాలం ఫిట్‌నెట్ కోసం!

29-08-2024 12:00:00 AM

వానకాలం జిమ్‌కు వెళ్లడం కష్టమే. అదే సమయంలో బయట వాన కురుస్తుంటే.. వేడి వేడి మిర్చి బజ్జీలు, సమోసాలు, పకోడాలు వంటి వాటిని ఇష్టంగా తింటారు. ఇది చాలా ప్రమాదకరం. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే చేసే చిన్న చిన్న వ్యాయామాలు ఏంటో చూద్దాం..

1.ప్లాంకింగ్

కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించాలనుకుంటే ప్లాంకింగ్ వ్యాయామం చేయాలి. ఇది నడుము చుట్టూ పేరుకున్న కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తుంది. అలాగే ఉదర కండరాలను టోన్ చేస్తుంది. అయితే ప్లాంకింగ్ చేసే సమయం 20 సెకన్లు ఉండాలి. అలా క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వ్యాయామం చేయాలి. 

2. స్కాట్

స్కాట్ అనేది క్యాలరీలను బర్న్ చేయడానికి, బరువును అదుపులో ఉంచడానికి చేసే వ్యాయామం. ఇది శరీరంలోని కండరాలను కూడా బలపరు స్తుంది. రోజూ స్కాట్‌లు చేయడం వల్ల కాళ్లు, నడుము ఆకారం అం దంగా ఉంటుంది. అలాగే కండరాలు టోన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. 

3. క్రంచెస్

నడుము చుట్టూ ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో క్రంచెస్ ఇంట్లోనే సులభం చేసుకోవచ్చు. ఇందులో రివర్స్ క్రంచ్ (ఇందులో వెనుకకు నేలపై పడుకొని, చేతులను నడుము కింద ఉంచి కాళ్లను పైకి లేపి వెనుకకు తీసుకొని, ఆపై వాటిని వెనక్కి తీసుకురావాలి). అదే విధంగా క్రిస్ క్రంచ్ చేయాలి. దీనిలో కుడి మోచేయిని ఎడమ మోకాలితో తాకాలి. ఎడమ మోచేయిని కుడి మోకాలితో తాకాలి. ఈ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. 

4. స్కిప్పింగ్

శరీరాన్ని ప్లెక్సిబుల్‌గా మార్చడంలో స్కిప్పింగ్ బాగా పని చేస్తుంది. ఇది క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. రోప్ జంప్ చేయడం రాకపోతే సింపుల్ జంప్, జంప్ అండ్ జాక్, లెగ్ క్రిస్ జంప్ వంటివి చేయవచ్చు. 

5. స్ట్రెయిన్ లెగ్

ఇంట్లోనే స్ట్రెయిన్ లెగ్ వ్యాయామం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం తుంటిపై పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు కండరాలను టోన్ చేయడంలో సహాయపడు తుంది. ఇది నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంతో పాటు భుజం కండరాలను బలపరుస్తుంది.