23-03-2025 12:40:54 PM
జహీరాబాద్, ఝరా సంఘం లో వడగళ్ల వాన
నేలకొరిగిన జొన్న ,దెబ్బతిన్న ఉల్లి పంట
జహీరాబాద్: జహీరాబాద్, ఝరాసంగం లో వడగళ్ల వాళ్ళతో కూడిన వర్ష బీభత్సం జరిగింది. జహీరాబాద్ లోని రాంనగర్ , చిన్న హై దరాబాద్ , రంజోల్ లో ఈదురు గాలులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం నిలదీశారు. శనివారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షం తో పాటు. వడగళ్ళు తోడు కావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఝరాసంగం మండలంలోని గుంత మర్పల్లి, కొల్లూరు ,కంబాలపల్లి, నర్సాపూర్ ,బోరగాం, భూపన్ పల్లి, జీర్లపల్లి ,ఈదులపల్లి గ్రామాలలో వర్షం లో వడగళ్ళు పడటంతో ప్రజ లు భయభ్రాంతులకు గురయ్యారు. రైతులు వేసిన జొన్న మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలకు నష్టం జరిగింది. పంటలు నష్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రమైన ఝరా సంగంలో కరెంటు స్తంభం వెరిగిపడ్డ ఎలాంటి ప్రమాదం జరగలేదు.