calender_icon.png 2 October, 2024 | 6:06 PM

నేడు, రేపు వర్షాలు

02-10-2024 02:40:14 AM

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో బుధ, గురువారా ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్టు వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూ డెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.