చెన్నై,(విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు కురిశాయని తెలిపింది. జిల్లాలు చెంగెల్‌పేట్, కాంచీపురం, తిరువళ్లూరు, ఉత్తర కోస్తా నగరం కడలూర్, కావేరి డెల్టా ప్రాంతాలు, తిరువారూర్, మన్నార్ గుడితో సహా అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక్కడ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడి చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 830 కి.మీ, నాగపట్టినానికి 630 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా ఉంది “ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఉత్తర-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది