హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రేపు ఉదయం నెల్లూరు-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశముందని చెప్పింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాలకు వర్ష సూచన. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.