calender_icon.png 18 April, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో నేడు వడగండ్ల వాన

11-04-2025 08:36:24 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగుడెం, జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేడు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశముంది.

గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం(Telangana Rain) బీభత్సం సృష్టించింది. సిద్దిపేట జిల్లాలోని తొమ్మిది మండలాల్లో అకాల వర్షం, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. నంగనూరు, చిన్నకోడూర్ మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. ప్రాథమిక విచారణ తర్వాత వ్యవసాయ, ఉద్యానవన అధికారులు 9,150 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు. నంగనూరు మండలంలో 4,941 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చిన్నకోడూర్‌లో 2,156 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, చేర్యాల్, మద్దూర్, ధూల్మిట్ట, బెజ్జంకి, కొండపాక్ మండలాల్లో కూడా తెల్లవారుజామున వర్షం కురిసింది.