calender_icon.png 26 October, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు జిల్లాల్లో వర్షాలు

29-07-2024 02:40:14 AM

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): వారం రోజులుగా రాష్ట్రంలో ని పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మో స్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు నిండిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వదులుతున్నారు. పలుచోట్ల చెరువులకు గండ్లు పడటంతో రోడ్లు కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జలాశయ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఆదివారం వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కాగా, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌న గర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములు గు, హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దప లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమ్రంభీం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాత నమోదైనట్టు అధికారులు తెలిపారు. కామారెడ్డి, సంగా రెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం  నమోదైందని వివరించారు.