09-04-2025 04:35:29 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): క్యూములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.