calender_icon.png 24 January, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే 4 రోజుల పాటు వర్షాలు

13-07-2024 12:46:47 AM

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట, ఖమ్మం జిల్లా వైరాలో 5.5 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.