హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వాన పడనుంది.
అటు జిల్లాల్లో ఆదివారం వర్షం దంచికోడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపడింది. అటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పటు ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయింది. ఈదురుగాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయిన్నాయి. నాగలిగిద్ద మండలం, ముక్తాపూర్ లో 5.1 సెం.మీ వర్షపాతం, మొగుడంపల్లి లో 2.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా, పెద్దశంకరంపేట మండలంలో పిడుగుపాటుకు తండ్రి, కోడుకు మృతి చెందారు. పాపన్నపేట మండలం, లింగాయిపల్లిలో 1.9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. ఆసిఫాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడాడంతో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఇబ్బందులు తలెతాయి. ఈదురుగాలులు, వర్షంలోనే సామస్యాత్మక కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందాని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలిని హెచ్చరించిన జీహెచ్ఎంసి, ఎదైన సమస్యలు ఉంటే 040 2111 1111, 90001 13667 నంబర్లకు సంప్రదించాలని వెల్లడించింది.