హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు ఈదరుగాలులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని శనివారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.