calender_icon.png 3 April, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదురోజులపాటు వర్షాలు

02-04-2025 01:31:24 AM

హైదరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి) : భూ ఉపరితలం వేడెక్కడం తో పాటు ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో రాబోయే ఐదు రోజు ల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నుంచి రెండురోజులపాటు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుంది.

వర్షాల కారణంగా రాష్ర్టంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. జగి త్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడ క్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవ కాశం ఉందని తెలిపారు.