మట్టికేం తెలుసు మనిషి మారి
మిట్ట పల్లం ఒకటి చేస్తాడని
నీళ్లకేం తెలుసు వాళ్ళ దార్లన్నీ
మూసి వేస్తాడని
చెట్టుకేం తెలుసు అడ్డంగా
తెగ నరికి పచ్చదనం పాడు చేస్తాడని
పట్టణీకరణ, నగరీకరణ, సుందరీకరణ
మానవ ప్రపంచంలో అదొక మాయ
రంగురంగుల శోభలు అద్దాల మేడలు
వానొచ్చిన నీరెల్లే దారి లేక
వరదలు వచ్చి వాగులు, వంకలు
పొంగి జనాల ఇళ్లన్నీ తొంగి చూస్తాయి
కట్టిన భవంతుల లోగిళ్ళలో
పడవలన్నీ బంతులాడుతాయి
ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్న జనం
ఆకలి దప్పులతో ఆర్తనాదాలు
అద్దాల గూటిలో నిద్రించినా
భేతాళుడు చెప్పినట్టు
తల వెయ్యి వక్కలవుతుంది
మంచికో మాట మనిషి మనిషితో పంచుకోవాలి
ఆక్రమణలు, దురాక్రమణలు ఆపేయాలి
జనబాహుళ్యమున్న చోట్ల శ్రద్ధతో
నిబద్ధతతో కట్టడి చేస్తేనే కష్టాలు తీరుతాయి
నీటికీ దారివ్వు, చెట్టుకీ చోటివ్వు
మనిషి మనుగడకు భవితకు స్థానం ఇవ్వు.
బొమ్మిదేని రాజేశ్వరి
9052744215