భారత్, కివీస్ తొలి టెస్టు
బెంగళూరు: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టెస్టు మొదటి రోజు వర్షార్పణమైంది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఆట సాధ్యం కాదని తేల్చి చెప్పిన అంపైర్లు తొలిరోజు ఆటను రద్దు చేశారు. పిచ్ సహా మైదానం మొత్తం పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చిన్నస్వామి స్టేడియం లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ వర్షం తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా పడే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు.