27-04-2025 11:10:13 AM
యాదాద్రి: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలుక కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, వలిగొండ, మోటకొండూర్, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి, తదితర మండలాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కోసిన పంట కల్లాల్లో ఉండడంతో ధాన్యం తడుస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం తడిసిన దానిని సైతం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.