గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు
టైటాన్స్ ఖేల్ ఖతం
ఏ మూలో మిణుకు మిణుకు మంటున్న గుజరాత్ ఆశాలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దుంది. దీంతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న కోల్‌కతా అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అహ్మదాబాద్‌ను ముంచెత్తడంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దుంది.
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ పోరాటం ముగిసింది. సోమవారం కోల్‌కతా, గుజరాత్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వరుణిడి కారణంగా రద్దుంది. ఎడతెరిపి లేని వర్షంతో టాస్ కూడా సాధ్యపడలేదు. మధ్యమధ్యలో కాస్త వర్షం తెరిపినివ్వడంతో మ్యాచ్ కనీసం ఐదు ఓవర్లునా సాగుతుందేమో అనుకున్న అభిమానుల ఆశలు ఫలించలేదు. మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమించి గ్రౌండ్‌ను సిద్ధం చేసే లోపే మరోసారి వర్షం ముంచెత్తడంతో పలుమార్లు సమీక్షించిన అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గుచూపారు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 19 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకోగా.. గుజరాత్ 13 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌రేసుకు దూరమైంది.
ఇప్పటికే కోల్ కతా నాకౌట్‌కు అర్హత సాధించగా.. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీటిలో రాజస్థాన్ 12 మ్యాచ్ ల్లో 16 పాయింట్లతో మెరుగైన స్థితిలో ఉండగా.. హైదరాబాద్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక మిగిలిన టీమ్‌లలో చెన్నై, బెంగళూరు మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. లక్నో కూడా లైన్‌లో ఉన్నా.. రన్‌రేట్ ఆ జట్టును దెబ్బతీసే అవకాశం ఉంది. తాజా సీజన్‌లో 63 మ్యాచ్‌లు జరగగా.. ఇందులో వర్షం కారణంగా రద్దున తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.